Header Banner

ప్రపంచవ్యాప్తంగా HP ఉద్యోగులకు షాక్! 2,500 మంది ఇంటిదారి!

  Sat Mar 08, 2025 19:28        Employment

కొత్త ఉద్యోగంలోకి మారాలని చూసేవారికి నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే ఈ ఏడాది మొదటి నుండి టెక్ కంపనీలు ఒకదాని తరువాత ఒకటి ఉద్యోగుల తొలగింపులు చేపడుతున్నాయి. నిన్న మొన్నటి దాకా ఇన్ఫోసిస్, గూగులు ఖర్చు తగ్గింపుల పేరుతో ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఈ లిస్టులో ఇప్పుడు తాజగా మరో కంపెనీ వచ్చి చేరింది. ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ అయినా HP ఉద్యోగులలో 2,500 మందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని వివిధ టెక్నాలజీ కంపెనీలు కూడా ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో భగ్గుమనే షాక్! కొడాలి నానికి బిగుస్తున్న ఉచ్చు.. రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు!

 

హ్యూలెట్ ప్యాకర్డ్ ఎంటర్‌ప్రైజ్ వచ్చే ఏడాదిన్నర కాలంలో కంపెనీ నుండి 2,500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో HP ఆర్థిక ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. అయితే కంపెనీ ఆశించినంత లాభాలు రాకపోవడంతో ఖర్చు తగ్గించుకునే చర్యలను అమలు చేస్తున్నట్లు హెచ్‌పి ప్రకటించింది అలాగే దానిలో భాగంగా ఉద్యోగులను తొలగించే చర్యలు తీసుకుంది. ఈ ప్రకటన తర్వాత HP స్టాక్ ధర 19% పడిపోయింది.

డేటాను స్టోరేజ్ చేసి నిర్వహించగల పెద్ద సర్వర్‌లను HP తయారు చేసి సప్లయ్ చేస్తుంది.ఈ కంపెనీ ఇటీవల తాజా త్రైమాసిక ఆర్థిక ఫలితాలను విడుదల చేసింది. గత సంవత్సరం కంటే కంపెనీ ఆదాయం 16 శాతం పెరిగినప్పటికీ ఫలితాలు ఆశించినంతగా పెరగలేదని HP తెలిపింది. HP కంపెనీ Nvidia తాజా చిప్‌లకు అవసరమైన కృత్రిమ మేధస్సు సామర్థ్యాలతో సర్వర్‌లను భారీగా ఉత్పత్తి చేస్తోంది. దీని ద్వారా సాంప్రదాయ సర్వర్‌లను తగ్గింపుకు అమ్మడానికి వీలు కల్పిస్తుంది. ఇదే కంపెనీ ఆదాయం తగ్గడానికి కారణమని కూడా చెబుతున్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


ఈ పరిస్థితిలో ఖర్చు తగ్గించే చర్యగా 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. దీని వల్ల 2027 నాటికి $150 మిలియన్లు ఆదా అవుతాయని HP చెబుతోంది. HPలోని 61,000 మంది ఉద్యోగులలో ఐదు శాతం మంది ఉద్యోగులపై ఈ తొలగింపు ప్రభావం పడనుంది. ఆధునిక AI- ఆధారిత పరికరాలతో పోటీ పడుతూ HP ప్రస్తుతం సాంప్రదాయ పరికరాలన్నింటినీ తక్కువ ధరలకు విక్రయిస్తోంది. ఫలితంగా, కంపెనీ ఆదాయం అలాగే లాభాలు గొప్పగా తగ్గాయి. అదే సమయంలో కృత్రిమ మేధస్సు సామర్థ్యాలతో కూడిన పరికరాలను అభివృద్ధి చేయడంలో కంపెనీ భారీగా పెట్టుబడి పెట్టాలి. అందువల్ల, ఈ కంపెనీపై పెట్టుబడిదారులు క్రమంగా విశ్వాసం కోల్పోతున్నారని నివేదికలు ఉన్నాయి.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మాజీ ఎమ్మెల్యే కుటుంబంలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో మనవడు మృతి!

 

జగన్ కి షాక్.. జనసేన గూటికి వైసీపీ మాజీ ఎమ్మెల్యే.. వైసీపీకి షాకిస్తూవారిని కూడా వెంట తీసుకెళుతున్నారుగా..

 

నన్ను మేడం అని పిలవొద్దు.. నేను మీ భువనమ్మను.! గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో..

 

మంత్రి ప్రసంగంతో సినిమా చూపించారు.. RRR ప్రశంస! నోరు ఎత్తని వైసీపీ.. బుల్లెట్ దిగిందాలేదా?

 

ఏపీ మహిళలకు ఎగిరి గంతేసే న్యూస్.. ప్రభుత్వ ఆటోలుఎలక్ట్రిక్ బైక్‌లు! రాష్ట్రంలోని 8 ప్రధాన నగరాల్లో..

 

బోరుగడ్డ అనిల్‌ పరారీలో సంచలనం.. ఫేక్ సర్టిఫికెట్ డ్రామా వెలుగులోకి! పోలీసుల దర్యాప్తు వేగం!

 

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై బిగ్ అప్డేట్.. ఈ కండిషన్ వర్తిస్తుందిఆ ఛాన్స్ లేదు!

 

ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. ఆ వీసాపై అమెరికా వెళ్లిన వారంతా.! మళ్లీ లక్ష మంది భారతీయులకు బహిష్కరణ ముప్పు.?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #HPJobCuts #TechLayoffs #HPEmployees #JobCrisis #TechIndustry